ప్రజా వ్యతిరేక విధానాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని తన నివాసంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ సీఎంగా ఒక్క మంచి పని చేయని బాబు 16 మంది సీనియర్ ఐపీఎస్‌లనూ వేధిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.