అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

85చూసినవారు
అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
నెల్లూరు జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ సీతారాంపురం పట్టణంలోని బెస్త కాలనీ అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు సందర్శించి, పిల్లల బరువు, ఎత్తు పరిశీలించారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రంలోని స్టాక్ ను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డిఓ మధులత, ఉదయగిరి ఐసిడిస్ ప్రాజెక్టు సిడిపిఓ పచ్చవ లావణ్య, సూపర్వైజర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్