అనంతసాగరం: ఆత్మహత్యానికి గల కారకులను శిక్షించాలి
అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ చదువుకునే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకుడైన హుస్సేన్ ను పోక్సో చట్టం కింద కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేంద్ర, శ్రీహర్ష డిమాండ్ చేశారు. ఆదివారం నెల్లూరులోని బాలాజీ నగర్ రామచంద్రారెడ్డి భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థినిని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి చివరికి బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తిని శిక్షించాలని అన్నారు.