ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేస్తున్న మద్యం షాపులను వెంటనే తొలగించాలంటూ సిపిఎం నెల్లూరు నగర కమిటీ శనివారం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పిఆర్సి వరకు ర్యాలీ నిర్వహించింది. నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, వెంకటేశ్వరపురం, మైపాడు గేట్, జగదీష్ నగర్, ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న షాపులను స్థానిక మహిళలు వ్యతిరేకిస్తున్నారని, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.