నెల్లూరు: ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకండి
ఫీజుల కోసం విద్యార్థులను ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేయవద్దని కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదని విద్యార్థులను క్లాసులకు, ప్రాక్టికల్స్ కు అనుమతించడం లేదని, విద్యా ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.