నెల్లూరు నగరంలో ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేస్తున్న మద్యం షాపులను వెంటనే తొలగించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని రామచంద్రారెడ్డి భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ.. నిబంధనలకు వ్యతిరేకంగా ఇళ్ల మధ్యలో, మసీదులు, దేవాలయాల పక్కన మద్యం షాపులు ఏర్పాటు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.