వికోట మండలంలోని నాయకనేరి పేర్నంబట్ జాతీయ రహదారిపై మంగళవారం చిరుతపులి పిల్ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని అటుగా ప్రయాణిస్తున్న ప్రయాణికుడు సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశాడు. కాగా పలమనేరు అటవీ శాఖ అధికారులు ఈ విషయాన్ని దృవీకరించాల్సి ఉంది. గతంలో కూడా ఇదే ఘాట్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుత మృతి చెందగా తమిళనాడు అధికారులు ఆంధ్ర సరిహద్దుల్లో పడేయడం గమనార్హం.