రాజంపేంట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బుధవారం విచారణ నిమిత్తం పలమనేరు డీఎస్పీ ఆఫీసుకు వచ్చారు. గతేడాది జూలై 18న ఆయనపై నమోదైన కేసులో కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయన డీఎస్పీ ఆఫీస్ కు వచ్చారు. ఎంపీ వస్తున్నారన్న సమాచారం మేరకు ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ మేరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.