పలమనేరు: అత్తమామల వేధింపులతోనే ఆత్మహత్య

54చూసినవారు
పలమనేరులోని కాకతోపు వీధిలోని శ్రీకాంత్ భార్య ప్రభావతి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె సోదరుడు స్పందిస్తూ, తన చెల్లెలి మృతికి ఆమె భర్త, అత్తమామలే కారణమని శుక్రవారం వాపోయాడు. భర్త అక్రమ సంబంధం, అత్త మామల వేధింపులు తట్టుకోలేక ప్రభావతి ఆత్మహత్య చేసుకున్నట్లు వారు ఆరోపించారు. కాగా ప్రభావతికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను కోరారు.

సంబంధిత పోస్ట్