పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని వైసీపీ నాయకులు చిత్తూరు పట్టణంలో పోరుబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ విజయానంద రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన నాయకులు ఆరు నెలలలోపే ప్రజలపై పెనుభారం మోపారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.