చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని వేపనపల్లికి చెందిన చంద్రమౌళి అనే వ్యక్తి తన తల్లిదండ్రులకు గుడి కట్టించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడుతూ తన తల్లిదండ్రులు మరణించారని తెలిపారు. వారంటే తనకు ప్రాణమని, కష్టపడి నన్ను బాగా చదివించారని అన్నారు. వారి జ్ఞాపకార్థంగా గుడిని కట్టించినట్లు ఆయన తెలిపారు.