కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని బుధవారం పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.