బంగారుపాళ్యం సమీపంలో మొగిలి ఘాట్లో ఓ లారీ బ్రేక్ ఫెయిల్ అవడంతో ముందు వెళ్తున్న రెండు లారీలను ఢీ కొన్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు, కృష్ణగిరి నుంచి ఒరిస్సాకు వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యింది ఈ క్రమంలో చెన్నై, చిత్తూరు వెళ్తున్న లారీలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీలకు డ్యామేజి కాగా ఓ వ్యక్తి గాయపడ్డాడు. బంగారుపాళ్యం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.