విజయవాడ: పెద్దిరెడ్డి అవినీతిపై విచారణ చేయండి: టీడీపీ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నగరవనాల నిర్మాణం, అక్రమ రోడ్లు, మైనింగ్ లైసెన్స్, భవన నిర్మాణాలలో జరిగిన అవకతవకలు అవినీతిపై విచారణ చేపట్టాలని విజయవాడలో సీఎం చంద్రబాబుకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మంగళవారం విన్నవించారు. పూతలపట్టు నియోజకవర్గంలో 1000 మినీ గోకులాలు మంజూరు చేయాలని కోరారు. అనారోగ్యం పాలైన టీడీపీ కార్యకర్తలకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.