విజయవాడలో వరద ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు మంగళవారం వేముల మండలంలోని చాగలేరు గ్రామానికి చెందిన ఎస్సీ సెల్ టీడీపీ నాయకుడు చంటి రూ. 25,000 విరాళాన్ని పులివెందులలో టీడీపీ కార్యాలయంలో టీడీపీ బాధ్యులు రవీంద్ర నాథ్ రెడ్డికి అందజేశారు. తన వంతు ఆర్థిక సాయం చేసిన చంటిని బీ. టెక్ రవి అభినందించారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు.