చిత్తూరు జిల్లా , పుంగనూరు నియోజక వర్గం, పులిచర్ల మండలం, కొంగం వారి పల్లి పరిసర ప్రాంతాలలో దాదాపు 16 ఏనుగులు గుంపు మామిడి, వరి , అరటి, పంటలను తొక్కి ధ్వంసం చేశాయి, ఏనుగుల గుంపు దాడులలో నష్టపోయిన పంటలను శుక్రవారం మధ్యాహ్నం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చల్లా బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఏనుగులు గుంపు పంట పొలాలపై దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు.