పులిచెర్ల మండలం, వెంకట దాసరి వారి పల్లి పంచాయతీ సువారపువారిపల్లి, హరిజనవాడలో భూ కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ ఇంటి స్థలాలను దౌర్జన్యంగా ఖాళీ చేయించి జెసిబితో చదును చేస్తున్నారన్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని బాధిత ప్రజలు కోరారు.