చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మామిడిలో పూత నుంచి కోత వరకు సస్యరక్షణ చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 8 మండలాలకు సంబంధించిన రైతు సేవా కేంద్రాల సిబ్బంది హాజరయ్యారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూధన్ రెడ్డి పాల్గొని రైతులు తీసుకోవలసిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు.