చిత్తూరు జిల్లా, పుంగనూరులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చైర్మన్ అలీమ్ బాషా, కమిషనర్ మధుసూదన్ రెడ్డి బుధవారం దుస్తులు పంపిణీ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యలయంలో సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వస్త్రాలు, కొబ్బరినూనె, పాదరక్షకాలు, సబ్బులు పంపిణీ చేశారు. పట్టణ శుభ్రతకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.