పుంగనూరు మండలం కృష్ణాపురం అటవీ ప్రాంతంలో వ్యక్తి హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ మాట్లాడుతూ.. మదనపల్లె మండలానికి చెందిన సోమశేఖర్ రెడ్డి(32) మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. దీనితో అతని తండ్రి గంగుల్ రెడ్డి సుపారి ఇచ్చి సోమశేఖర్ ను హత్య చేయించాడన్నారు.