పుంగనూరు: పేకాట స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు

50చూసినవారు
పుంగనూరు: పేకాట స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం సుగాలిమిట్ట అటవీ ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 2. 40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఎవరైనా జూదం ఆడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన అన్నారు. చట్ట వ్యతిరేక పనులకు శిక్ష తప్పదని సీఐ సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్