ముత్తుకూరు: కోరం లేక సమావేశం వాయిదా
ముత్తుకూరు గ్రామపంచాయతీ సాధారణ సమావేశానికి ముగ్గురు వార్డు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేయడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి జగదీష్ తెలిపారు. శనివారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించగా వార్డు సభ్యులు షఫీ, మణి, వెంకటేశ్వర్లు హాజరు కాగా మిగిలిన వారు హాజరు కాలేదు. అజెండాలో రూపొందించిన అంశాలపై చర్చకు సభ్యులు లేకపోవడంతో సమావేశం వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు.