మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్ నాశనమవుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివ రామకృష్ణా రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో మాదకద్రవ్యాల నివారణ, ఈవ్ టీచింగ్- ర్యాగింగ్, సైబర్ క్రైమ్, మోటార్ వెహికిల్ చట్టం, సీ. సీ కెమెరాల ఏర్పాటుపై ఎస్ఐ హనీఫ్ తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.