మాదక ద్రవ్యాలు సేవించి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని ఎస్ఐ వీరేంద్ర బాబు సూచించారు. తోటపల్లిగూడూరు ఎన్. డి. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మాదక ద్రవ్యాలు-వాటి చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఐ వీరేంద్ర బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే కలిగే అనర్థాలను వివరించారు.