తిరుపతి రూరల్ మండలం పద్మావతి పురం సర్పంచ్ అధ్యక్షతన దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందుకు ముఖ్య అతిథిగా తాజా, మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వైయస్సార్ చిత్రపటానికి హారతి ఇచ్చి నమస్కరించుకొని కేక్ కట్ చేసి పంచారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ముఖ్య నేతలు, కార్యకర్తలు, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.