సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం నుంచి టీపీ కోటకు వెళ్లే తారు రోడ్డు పూర్తిగా మట్టి రోడ్డుగా మారి గుంతలమయం అయ్యిందని గురువారం స్థానికులు తెలిపారు. 15 సంవత్సరాలుగా పాలకులు మారుతున్నా తమ జీవితాలు మారడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వజ్జా వారి కండ్రిక వద్ద గుంతలు ఎక్కువ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డును నిర్మించాలని కోరుతున్నారు.