తిరుపతి జిల్లా నాగలాపురం మండలం నుండి సత్యవేడు కు అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను సత్యవేడు ఎమ్మార్వో టీవీ సుబ్రహ్మణ్యం మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మార్వో మాట్లాడుతూ. అనుమతులు, సరైన పత్రాలు లేకుండా ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే రెవెన్యూ శాఖ తరపున కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ రవాణాఫై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ శాఖ నిఘా పెట్టినట్లు తెలిపారు