నాగలాపురం: జాతీయ రహదారిని కమ్మేసిన పొగ మంచు

55చూసినవారు
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం వద్ద తిరుపతి-చెన్నై జాతీయ రహదారిని గురువారం ఉదయం దట్టమైన పొగ మంచు కమ్మేసింది. అర్ధరాత్రి నుంచి మంచు తీవ్రత ఎక్కువైంది. మంచు ధాటికి, చలి తీవ్రతకు చిన్నపిల్లలు, వృద్ధులు వణికిపోతున్నారు. తిరుపతి చెన్నై హైవేలో వాహన డ్రైవర్లు లైట్లు వేసుకుని అతి నెమ్మదిగా ప్రయాణించవలసి వచ్చింది.

సంబంధిత పోస్ట్