వైభవంగా కల్యాణ వేంకన్న ఊయలసేవ

83చూసినవారు
వైభవంగా కల్యాణ వేంకన్న ఊయలసేవ
నారాయణవనం స్థానిక శ్రీపద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరువల నెల మొదటి శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను వైభవంగా నిర్వహించారు. ఉదయం మూలవర్లకు సుప్రభాత సేవతో మేల్కొలిపి అభిషేకాల అనంతరం నిత్యకైంకర్య పూజలనుచేపట్టారు. సాయంత్రం అర్చకులు దేవేరులసమేత శ్రీనివాసుడిని నూతన పట్టువస్త్రాలు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి సంకీర్తనల నడుమ ఊయల సేవను జరిపించారు.

సంబంధిత పోస్ట్