పిచ్చాటూరు మండలం వెంగళత్తూర్ గ్రామంలో శనివారం శ్రీ వేణుగోపాల స్వామి భజన మందిరంలో ఆలయ ప్రధాన అర్చకులు గురు శర్మ చంద్రు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తులసీదలములతో వేద పారాయణం జరిపారు. నైవేద్యం సమర్పించి కర్పూర నిరాజనాలు అందజేశారు. గురువులైన లోకేష్ దాస్, శివకుమార్ దాస్, తులసీదాస్ బృందముచే భజనలు జరిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.