వెంగళత్తూర్ గ్రామంలో ఉన్న పురాతన ఆలయంలో సోమవారం ఉదయం పౌర్ణమి సందర్భంగా శ్రీ భిక్షాండేశ్వర స్వామికి ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి అభిషేకము జరిపారు, అనంతరం పట్టు వస్త్రాలను సమర్పించారు. నైవేద్యం సమర్పించారు. కర్పూర హారతులు అందజేశారు. గురువులైన లోకేష్ దాస్, శివ కుమార్, తులసి, గ్రామ భక్తులతో కలిసి శివనామ స్మరణ చేశారు. ఉభయ దాతలు భక్తులకు అన్నప్రసాదాలను అందజేశారు.