కొద్ది రోజులుగా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న వీధి కుక్కల సమస్యకు మున్సిపల్ అధికారులు చెక్ పెట్టారు. మంగళవారం అనిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ రేబీస్ కార్యక్రమాన్ని చేపట్టి వీధి కుక్కలను పట్టుకున్నారు. కుక్కల సంతాన నిరోధానికి, అలాగే యాంటీ రేబీస్ టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. టోకెన్ల ప్రకారం ఎక్కడ పట్టుకున్న కుక్కలను అదే ప్రాంతంలో తిరిగి వదిలివేయడం జరుగుతుందన్నారు.