శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం భిక్షాల గాలి గోపురం వెయ్యేళ్ల చరిత్ర కలిగిన గోపురం. 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. ప్రస్తుతం అక్కడక్కడా పిచ్చి మొక్కలు మొలిచి, పాచి పట్టి దర్శనమిస్తుంది. అధికారులకు ఆదాయంపైన ఉండే శ్రద్ధ ఆలయ నిర్మాణాలపై కూడా ఉండాలని గురువారం పలువురు భక్తులు పెదవి విరుస్తున్నారు.