శ్రీకాళహస్తి: అతిథి గృహంలో మందు బాబుల వీరంగం

60చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధమైన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి అతిథి గృహంలో శనివారం మందుబాబులు వీరంగం సృష్టించారు. మోహన్ రెడ్డి పేరుపై రూమ్ 7ను యువకులు బుక్ చేసుకున్నారు. దేవస్థానం రూములలో మద్యం నిషేధం ఉన్నప్పటికీ యథేచ్ఛగా తెచ్చుకొని తాగారు. అనుమానం వచ్చిన సిబ్బంది రూము తనిఖీ చేయగా మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. ఉన్నతాధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్