శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడులోని బాలికల జూనియర్ కళాశాలలో శనివారం మధ్యాహ్న భోజన పథకం ఎంఈఓ భారతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తల్లి బొజ్జల బృందమ్మ పాల్గొన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించడం శుభ పరిణామమని బృందమ్మ అన్నారు. విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.