శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం రాజులపాలెం గ్రామంలో రోడ్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అధ్వానంగా మారాయి. రోడ్లలో వర్షపు నీరు చేరి మడుగులను తలపిస్తున్నాయి. మరికొన్ని రోడ్డులు బురద చేరి అడుగు వేయలేని పరిస్థితి నెలకుంది. ఈ రోడ్లపై ప్రజలు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సైడ్ కాలువలు లేకపోవడంతో ప్రజల బాధలు వర్ణనాతీత. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని గురువారం ప్రజలు కోరుతున్నారు.