శ్రీకాళహస్తి: ప్రమాదాల నివారణ కోసం చర్యలు
శ్రీకాళహస్తి హైవేపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు వాపోయారు. ఇందులో భాగంగా వాటిని నివారించే నిమిత్తం డి. ఎస్. పి నరసింహమూర్తి సూచనలతో టూ టౌన్ సీఐ వెంకటేశులు హైవేపై సోమవారం సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. స్పీడ్ బ్రేకర్లు, టర్నింగ్‌లు, వేగ నియంత్రణ బోర్డులు గుర్తించడం ద్వారా ప్రమాదాల బారి నుంచి వాహన దారులను కాపాడొచ్చని సీఐ తెలిపారు.