శ్రీకాళహస్తి పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద కాలువపై అక్రమంగా నిర్మించుకున్న బంకులను గురువారం అధికారులు తొలగించారు. మున్సిపల్ కమిషనర్ గిరి కుమార్ ఆదేశాల మేరకు పురపాలక, విద్యుత్ శాఖ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ముందుగా విద్యుత్ వైర్లు, అనంతరం జేసీబీ సాయంతో బంకులను అధికారులు తొలగించారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నట్లు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.