సూళ్లూరుపేట మండలంలోని కడపట్ర పంచాయతీ నందు మంగళవారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రోడ్డు నిర్మాణం కూడా చేపడతానని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు.