నాయుడుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, గాలులతో కూడిన వర్షం కురవడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ప్రవహించింది. ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో చిరు వ్యాపారులు, ద్విచక్ర వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు. పట్టణంలోని బస్టాండు, రైల్వేస్టేషన్, బజారువీధి, విన్నమాల, చంద్రబాబు నాయుడు కాలనీ, కాళహస్తి రోడ్డు తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.