సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట స్వర్ణముఖి నదిలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే ఏటి పండగ వేడుకలకు సర్వం సిద్ధం చేసినట్లు నిర్వాహకులు మంగళవారం తెలిపారు. బుధవారం నుంచి మూడు రోజులపాటు ఏటి పండుగ వేడుకలను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ సారధ్యంలో నిర్వహించేలా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. నది వద్ద ప్రజలను ఆకట్టుకునేలా శిల్పాలు, రంగులరాట్నాలు తదితర వాటిని ఏర్పాటు చేస్తున్నారు.