పర్యావరణ హిత లక్ష్యంగా వినాయకచవితి జరుపుకోవాలని 'పర్యావరణహిత నిమజ్జనమే పరిపూర్ణ నిమజ్జనం'పోస్టర్ ను, కరపత్రాలను ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, కాలుష్య నియంత్రణ మండలి అధికారి మదన్ మోహన్ రెడ్డిలతో కలిసి గురువారం తిరుపతి కలెక్టరేట్ లో కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడేలా మట్టి వినాయకులని ఉపయోగించాలని కోరారు.