తిరుపతి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో మంగళవారం ఎక్సైజ్ సూపరింటెండెంట్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తిరుపతి జిల్లాలో 227 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు 09 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 11వ తేదీ టెండర్ల డ్రా ఉంటుందని చెప్పారు.