తిరుపతి జిల్లాను పర్యాటక, ఆతిథ్య రంగంలో అన్ని విధాల అందరి సమన్వయంతో కలిసి కట్టుగా అభివృద్ధి చేస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. సోమవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్ లో పర్యాటక, ఆతిథ్య రంగంలో చక్కగా కృషి చేసిన వారిని గుర్తించి వారికి రాష్ట్ర సీఎం చేతుల మీదుగా ప్రపంచ పర్యాటక దినాన విజయవాడలో అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న పలువురికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.