రైతులకు సూచనలు చేసిన వ్యవసాయ అధికారి

60చూసినవారు
రైతులకు సూచనలు చేసిన వ్యవసాయ అధికారి
వరి పంటను సాగుచేసే రైతులు సాగు విషయంలో వ్యవసాయ అధికారులు సూచనలు, సలహాలు తప్పకుండా పాటించాలని ఉదయగిరి మండలం వ్యవసాయ అధికారి ఆంజనేయులు సూచించారు. ఆయన శుక్రవారం మండలంలోని గుడి నడవ, గండిపాలెం గ్రామాల్లో సాగులో ఉన్న పంటలను పరిశీలించారు. వరి నారు నాటుకునే సమయంలో కొసలు తుంచి నాటాలన్నారు. నాటు సమయంలో కాలిబాటలు ఏర్పాటు చేయడం, గట్లపై ఉన్న కలుపు మొక్కలను తీసేయాలి అన్నారు.

సంబంధిత పోస్ట్