ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హర్షనీయమని తిరుపతి జిల్లా మాదిగ ఉద్యోగ సమాఖ్య ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య, ఏపీ ప్రజా సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గద్దల మునెయ్య మాదిగ తెలిపారు. గురువారం డక్కిలి- కమ్మపల్లి రోడ్డు సెంటర్లో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.