వెంకటగిరి: పెంచలకోనలో మౌలిక వసతులు కల్పించాలి
వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు సమీపంలో కలిసి ఉన్న పెనుశిల నరసింహస్వామి పుణ్య క్షేత్రంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ గురువారం జరిగిన శాసనసభలో చర్చించారు. ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ. ఈ పుణ్యక్షేత్రం నెల్లూరు, రాయలసీమ, ప్రకాశం జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల రాబడి రూ. 12 కోట్లకు పైగా వస్తుందన్నారు.