ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి అనూష తెలిపారు. శనివారం బాలాయపల్లి మండలం వెంగమాంబపురం హై స్కూల్లో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థి దశ నుంచి చట్టాలను తెలుసుకొని అవగాహన పెంచుకోవాలని, ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో చదువులో రాణించి ఉన్నత స్థాయిలో చేరుకోవాలని సూచించారు.