
వెంకటగిరి: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో 17 మందికి రూ. 10. 6210.62 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శుక్రవారం తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పేదలకు ఈ సహాయం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.