ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.